Skill University Admission | స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ షురూ..
Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స...