Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Shocking

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..
World

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది. గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల కనిపించింది. కొండచిలువ పొట్ట‌లో పూర్తిగా దుస్త...
National

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు. ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి త...
Trending News

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..

మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు. shweta wildliferescuer ఇన్‌స్టాగ్రామ్  లో  ఓ వీడియోను పరిశీలిస్తే.. ఒక మాల్ లో ఒక పెద్ద పాము దాగి ఉందని తెలిసి ఈ యువతి అక్కడికి వెళ్లింది.  ప్రశాంతతతో పాములను బంధించే పరికరాన్ని పట్టుకొని ఆ సరీసృపాన్ని రక్షించడానికి లోపలికి అడుగులు వేసింది. కొద్దిసేపటికే ప్రశాంతంగా పామును తన చేతితో పట్టుకొని దుకాణం నుండి బయట...
Exit mobile version