Self Help Groups | మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..
Self Help Groups RTC Buses | రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల మహిళా సమాఖ్యలకు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను సైతం మంగళవారం విడుదల చేసింది. ఒక్కో బస్సు విలువ రూ.36 లక్షలు. ఒక్కో మండల సమఖ్య, ఒక్కో బస్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇవ్వనుంది.నెలకు అద్దె రూపంలో మండల సమఖ్య(Self Help Groups) కు టిజి ఆర్టీసీ (TGSRTC) రూ. 77, 220 చెల్లించనుంది. మొత్తం 150 అద్దె బస్సులను ఆర్టీసికి మండల సమఖ్యలు అప్పగించనున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోలకు ఆయా బస్సులను వినయోగించనున్నారు.
మొదటి విడతలో ఈ జిల్లాలకు
కాగా మొదటి విడతలో ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆర్థికంగా ప...