Vajpayee Statue : పబ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొనసాగుతుండగా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...