Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: SEBI

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం  ఒప్పందాలు..
Trending News

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...
Business

Hindenburg Report | భారత్ మార్కెట్ పతనానికి కాంగ్రెస్ కుట్ర | హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ ఫైర్

Hindenburg Report  | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలపై అధికార పార్టీ బిజెపి ప్రతిపక్షాలపై ధ్వ‌జ‌మెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ భారతీయ స్టాక్ మార్కెట్ పతనమైపోవాలని కోరుకుంటోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. "భారతదేశంపై ద్వేషం" సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కుతంత్రాన్ని భారతదేశ ప్రజలు తిప్పికొట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, టూల్‌కిట్ ముఠా కలిసి భారతదేశంలో ఆర్థిక అరాచకానికి అస్థిరతకు గురిచేయాల‌ని కుట్ర పన్నాయని ఆయన మండిప‌డ్డారు. హిండెన్‌బర్గ్ నివేదిక గ‌త‌ శనివారం విడుదలైంది. సోమవారం క్యాపిటల్ మార్కెట్ అస్థిరమైందని మాజీ న్యాయ మంత్రి అన్నారు. షేర్లలో కూడా భారతదేశం సురక్షితమైన, స్థిరమైన ఆశాజనకమైన మార్కెట్ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్ సజావుగా సాగేలా చూసుకోవడం సెబీ చట్టపరమైన బాధ్యత. మార్కెట్ ను కూల‌దోసేందుకు ప్ర‌త...
Exit mobile version