Tuesday, March 4Thank you for visiting

Tag: Schools

Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?

Telangana
Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో దసరా పండగ వ‌స్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వ‌చ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజ‌య‌ద‌శ‌మి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవుల‌ను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమ‌వుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొద‌ల‌వుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రా...

ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

Telangana
Integrated Residential Schools  | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాలల‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క అడుగువేసింది. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌. డిప్యూటీ సీఎం నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర ప‌రిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్‌ ‌శాంతికుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ తొలి స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. కొడంగల్‌, ‌మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల (Integrated Residential Schools) నిర్మాణ పనులను వ‌చ్చే నెలాఖరులోనే ప్రారంభించాలని ఆదేశించారు. పరిపాలనా అనుమతుల కోసం ప్రత...

CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

Telangana
CM Revanth Reddy  | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామ‌న్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేద‌ని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ (vandemataram foundation) ఆధ్వ‌ర్యంలో  రవీంద్రభారతిలో సోమ‌వారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ...

ఆ స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం పడుకుండే ఫీజు బాదుడే.. డెస్క్, చాపలు, బెడ్స్ ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు

Trending News
china: చైనాలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జిషెంగ్ ప్రైమరీ స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి కొత్తరూల్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతిగదుల్లో నిద్రపోయే పిల్లల కోసం అదనంగా ఫీజులు వసూలు చేయనున్నట్ల ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించిన ప్రకారం, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీచాట్ ‌(WeChat) లో పాఠశాల నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. అందులో ఛార్జీలను వివరించకుండా అనుబంధ రుసుములతో వసూలు చేయనున్నట్లు ఉంది. ఆ నోటీసు ప్రకారం, డెస్క్‌పై పడుకుంటే 200 యువాన్లు (US$28) వసూలు చేస్తారు. అయితే, తరగతి గదుల్లో చాపలపై నిద్రించడానికి విద్యార్థులకు 360 యువాన్లు (US$49.29) ఖర్చవుతుంది. ప్రైవేట్ గదులలో బెడ్‌లపై నిద్రిస్తే మొత్తం 680 యువాన్లు (US$93.10) ఖర్చు అవుతుందని పేర్కొని ఉంది. విద్యార్థులను చూసేందుకు ఉపాధ్...
Exit mobile version