ED raids in Jharkhand : మంత్రి సహాయకుడి ఇంట్లో పట్టుబడిన నోట్ల గుట్టలు..
ED raids in Jharkhand | జార్ఖండ్ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సోమవారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) పలు పథకాల అమలులో అక్రమాలు జరిగాయి. ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమవారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్ట...