రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్
Samsung Galaxy S25 Ultra Price cut | గత నెలలో విడుదలైన తర్వాత తొలిసారిగా శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రారంభంలో రూ.1,29,999 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే అందుబాటులో ఉంది. కొత్త ఆఫర్ ద్వారా కొనుగోలుదారులు రూ.30,000 వరకు అద్భుతమైన ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ భారీ తగ్గింపు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ప్రీమియం ఫోన్ ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్‌లను తనిఖీ చేయండి.
Samsung Galaxy S25 అల్ట్రా డిస్కౌంట్
డిస్కౌంట్ ధరతో పాటు, Samsung Galaxy S25 Ultra కొనుగోలు చేసినప్పుడు రూ. 9,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ చే...