Monday, April 21Welcome to Vandebhaarath

Tag: Sambhal

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం
National

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం

Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జ‌రిగిన‌ ప్రాంతంలో శాంతిభద్రతలను ప‌టిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూక‌లు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉప‌యోగిస్తున్నారు. గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విష‌యం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. అయితే పోలీసుల‌పై అల్ల‌రి మూక‌లు విసిరిన‌ రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగి...
Trending News

Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత ...
National

Bulldozer action | సంభాల్ లో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌.. ఇక్క‌డ విద్యుత్ స్థంభాల‌నూ ఆక్ర‌మించుకున్న ఘ‌నులు

Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్‌ (Sambhal) లో అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేశారు. ప‌ట్ట‌ణంలో కొంతమంది నివాసితు రోడ్ల‌ను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్ర‌మించేసుకున్నారు అని ప‌ట్ట‌ణ‌ సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి (SDO) తెలిపారు. "కొందరు విద్యుత్‌ కనెక్షన్, సరైన మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. లోపల ఇంకా పాత మెకానికల్ క‌రెంట్‌ మీటర్ ఉంది. పాత మీటర్లను 15 సంవత్సరాల క్రితం నిలిపివేశాం. అందుకే ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము" అని బుల్డోజర్ చర్య సందర్భంగా త్రిపాఠి ANIకి తెలిపారు. "మెకానికల్ మీటర్లను ఇకపై అమర్చకూడదని 15 సంవత్సరాల క్రితం ఆదేశాలు వచ్చాయి. పాత మీట‌ర్లు ఎక్క‌డ క‌నిపించినా దానిని అధికారులు వెంట‌నే తొల‌గిస్తారని తెలిపారు. సంభ‌ల్ లో దాదాపు 2-3 ఇళ్లలో విద్యుత్‌ను దొంగిలించడం కనిపించిందని, అయితే మొత్తం ఇళ్ల సంఖ్య విచారణ తర్వాత త...
Viral

Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి

Bulls Fight in Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు భీకరంగా పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆ రెండు ఎద్దులూ తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సంభాల్‌ (Sambhal) జిల్లాలోని ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో కొట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని బారికేడ్‌ (Barricade)ల సాయంతో వాటి మధ్య ఫైటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆగ్రహించిన ఆ ఎద్దులు పోలీసులపైకి వేగంగా దూసుకెళ్లాయి. దీంతో వారు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. వాటి దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. उत्तर प्रदेश के संभल जिले में भिड़े दो आवारा सांड, वायरल हुआ वीडियो बैरिकेडिंग अड़ाकर जब दोनों को अलग क...
Exit mobile version