Monday, April 21Welcome to Vandebhaarath

Tag: Sambhal Violence

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం
National

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం

Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జ‌రిగిన‌ ప్రాంతంలో శాంతిభద్రతలను ప‌టిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూక‌లు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉప‌యోగిస్తున్నారు. గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విష‌యం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. అయితే పోలీసుల‌పై అల్ల‌రి మూక‌లు విసిరిన‌ రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగి...
Trending News

Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు. సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 24న హింసాకాండ జరిగిన రోజు సంభాల్ సహ అనూజ్ చౌదరిపై కాల్పులు జరిపినట్లు సలీంపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సలీంపై కూడా గ‌తంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై హత్యాయత్నం, దోపిడీ, గోహత్య సహా 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచ...
Trending News

Sambhal violence : సంభాల్ హింసాకాండ‌లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు

Sambhal violence  :  సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాత‌న మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లుచేప‌ట్టిన‌ట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు. "ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 మందిని అరెస్టు చేశారు. ఇంకా 74 మందిని గుర్తించాం. ఇతర నిందితుల‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని సాధారణీకరించడమే మా ల‌క్ష్యం. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని చెప్పారు నిరాధారమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కోరారు. “ప్రజలు కేవలం దర్యాప్తు కోసం మాత్రమే కాకుండా, పరిస్థితిని సాధారణీకర...
Crime

Sambhal Violence | సంభాల్‌ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు

Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మ‌సీదును స‌ర్వే చేయ‌డానికి వ‌చ్చిన అధికారుల‌ సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు లాఠీచార్జికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు. సంభాల్‌లోని షాహీ జామా మసీదుకు సంబంధించి వివాదం నెలకొంది. ఇక్కడ హిందూ పక్షం ఇది జామా మసీదు కాదని, హరిహర‌ దేవాలయమని వాదిస్తోంది. దీనిపై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా, విచారణకు ఆదేశించింది. ఈరోజు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ఇక్కడ సర్వే నిర్వహించాల్సి ఉంది. అడ్వకేట్ కమీషనర్ సర్వే కోసం వచ్చారు, అయితే ఇంతలో పెద్ద సంఖ్యలో దుండ‌గులు అక్కడ గుమిగూడి రాళ్ల దాడి ప్రారంభించారు. షాహీ జామా మసీదు సర్వే సందర్భ...
Exit mobile version