ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది.
శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం
కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన శరీరానికి కావాలసిన సోడియంలో 90 శాతం ఉప్పు నుండే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్.
అయితే ఈ ఉప్పులో వాటి రూపం, రుచి, కూర్పును బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఇవి రుచిలోపాటు పోషక విలువల్లో కూడా భిన్నంగా ఉంటాయి. మార్కెట్ లో లభించే పలు ఉప్పు రకాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం..
టేబుల్ ఉప్పు(Table Salt)
అత్యంత సాధారణంగా అందరి ఇళ్లో ...