Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..
Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు.
అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది.
కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి?
క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది. ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసి...