Wednesday, June 18Thank you for visiting

Tag: RRR

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. 2022లో వ‌చ్చిన ఈ సినిమా రికార్డును బ‌ద్ద‌లు కొట్టిందా?

Entertainment
Allu Arjun Pushpa 2 record |  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఎట్టకేలకు పెద్ద తెరపైకి వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు 175 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. సినిమా విడుదల కాకముందే, సినిమా తొలిరోజు కోట్లలో వసూళ్లు రాబడుతుందని అభిమానులు ఊహించారు. అయితే, పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించిన మరొక సౌత్ చిత్రం అవుతుంద‌ని భావించారు. పుష్ప 2 మొదటి రోజు లెక్క‌లు ఎలా ఉన్నాయో తెలుసా? క‌న్న‌డ అగ్ర న‌టుడు యష్ నటించిన KGF: చాప్టర్ 2 పాన్ ఇండియ‌లో ఎలా ఘ‌న విజ‌యం సాధించిందోఅంద‌రికీ తెలిసిందే.. 2022 ఏప్రిల్ లో విడుదలైన KGF 2 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది, ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, KGF 2 మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 135 కోట్లు. KGF 2 పాన్-ఇండియా విడుదల. ఈ సినిమా కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, తెలుగుతో సహా 5 భాషల్లో విడుదలైంది. ...

Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?

Telangana
Registration Charges | తెలంగాణ‌లో రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నవంబర్‌ నుంచి సవరించిన చార్జీలను అమ‌లు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల‌కు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అంద‌జేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించ‌లేదు. ఈ క్ర‌మంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక‌ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేర‌కు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్‌ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. హైద‌రాబాద్ ర...

RRR Alignment | రీజిన‌ల్ రింగ్ రోడ్ పై స‌ర్కారు కీల‌క ఆదేశాలు.

Telangana
RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేలా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూత‌నంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న‌ నివాసంలో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన‌గ...

RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

Telangana
హైదరాబాద్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (RRR ) ‌ప్రాజెక్టుకు కావ‌ల‌సిన భూసేకరణ కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్‌ ‌రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైద‌రాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ... హైద‌రాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యత‌ను ఇస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్ర‌క్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. RRR కింద భూములు...

Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Telangana
Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని,  ప్రజా రవాణాలో  మెట్రో రైలు కీలకమైనదని మంత్రి  చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో విస్తరణకు ప్రాధాన్యం మొదటి దశ మెట్రో అనుభవంతో మరింత చాకచక్యంగా రాష్ట్ర ప్రభుత్వం..  రెండో దశ ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి తదనుగుణంగా మార్పులు చేసింది. సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చడమే కాకుండా, మెట్రో నగరంలోని వివిధ ప్రాంతాలను అ...

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

Andhrapradesh, Telangana
తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

Telangana
ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...
Exit mobile version