solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?
solar systems: తెలంగాణలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా. సోలార్ విద్యుత్ వల్ల కలిగే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీల పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే.. సోలార్ విద్యుత్ కకోసం గృహాలకు అందిస్తున్న సబ్సిడీ ఎంత? మహిళా సంఘాలకు ఏ విధమైన సబ్సిడీ అందజేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సోలార్ రూఫ్ టాప్.. నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు కోసం రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అందజేస్తుంది. దీని వల్ల అధిక కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే.. సోలార్ పవర్ సిస్టం మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కనీసం 100 చదరపు అడుగుల రూఫ్ ఉండాలి.. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహణకు ఇబ్బంది అవుతుందనే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్య...