2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు.
భారతదేశంలో ప్రతిరోజూ 33 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేయడానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది నిర్మించనున్న 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మొత్తం పొడవు 5,467 కి.మీ. ఈ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు 16 రాష్ట్రాల ...