చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదా...