Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: RG Kar Medical College

RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు
Crime

RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు

RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్ర‌మంగా త‌న‌ను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. "వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు. ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజ‌య్‌ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచార‌ణ‌లు జరిగాయి. ఈసంద‌ర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష), 103 (హత్యకు శిక్ష)...
Crime

West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా

Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హ‌త్య‌ ఘటనలో షాకింగ్ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార‌ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్క‌సారిగా రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల హాస్పిట‌ల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్ట‌ర్ ...
Trending News

Kolkata doctor rape-murder case | అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి బాధితురాలి పేరు, ఫోటోలను వెంటనే తొలగించండి

Kolkata doctor rape-murder case | ఆర్‌జి కర్ హాస్పిటల్ కేసులో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే ఏదైనా కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియాకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఎక్క‌డా క‌నిపించ‌కుండా చూసుకోవాల‌ని చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా అధ్యక్షత వహించారు. బాధితురాలి గుర్తింపును వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచురించడాన్ని సుప్రీమ్ కోర్టు తీవ్రంగా స్పందించింది. సోష‌ల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో బాధితురాలి ఫొటోలను బాధ్యతా రహితంగా ప్రచారం చేయడం వల్ల ఈ నిషేధాజ్ఞను జారీ చేయవలసి వచ్చిందని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. బాధితురాలి శరీరం కోలుకున్న తర్వాత దాన...
Exit mobile version