BSNL కు పోటెత్తుతున్న కొత్త కస్టమర్లు..
BSNL | రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, జూలై 4వ తేదీలలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా- తమ టారిఫ్‌లను 11-25 శాతం పెంచాయి. దీంతో సోషల్ మీడియాలో 'BSNL కి ఘర్ వానపీ, అలాగే 'BoycottJio' వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో హోరెత్తాయి.
2,50,000 కొత్త కస్టమర్లు..
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ టారిఫ్ పెంపుల ఫలితంగా వినియోగదారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఉపయోగించి సుమారు 2,50,000 మంది BSNLకి మారారు. BSNL కూడా దాదాపు 2.5 మిలియన్ కొత్త కనెక్షన్‌లను పొందింది, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. రూ. 600 స్పైక్‌తో వార్షిక డేటా ప్లాన్‌లతో గరిష్ట ధర పెరుగుదల కనిపించింది. ఎయిర్‌టెల్, రిలయన్స్...