Greenfield Express way : ఉత్తర తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండర్లు
తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్డు (RRR project) ఉత్తర భాగాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం (Central government) ప్రారంభించింది. Greenfield Express way గా నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఫోర్‌లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్నినిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక మౌలిక సౌకర్యాల ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభజించారు. రూ. 7,104.06 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (Regional Ring Road) ) నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది.
161.518 కిలోమీటర్ల Greenfield Express way నిర్మాణం
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుమారు 161.518 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా టంగడపల్లి వరకు సాగుతుంది. దీని పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని కా...