Saturday, March 15Thank you for visiting

Tag: Rape

Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

Crime
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్ష్యాల తారుమారు నివేదికల ప్రకారం, సందీప్ ఘో...

Bulldozer Action | మైనర్ బాలికపై రేప్‌ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video

National
Bulldozer Action | మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న‌ సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్‌ ఖాన్‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం బుల్డోజ‌ర్ చ‌ర్య చేప‌ట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేల‌మ‌ట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వ‌హిస్తున్న‌ట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించ‌గా అధికారులు వెంట‌నే అమ‌లు చేశారు. ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌ స్పందించారు. అయోధ్యలో తాము గెలిచామని అఖిలేష్ యాదవ్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మొయీద్‌ ఖాన్ వంటి నేరగాళ్ల సాయంతో వాళ్లు గెలిచారని విమర్శించారు. ఇలాంటి క‌రడుగ‌ట్టిన నేర‌గాళ్లను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్‌వాది పార్టీ వారిని కాపాడుకుంటోంద‌ని అన్నారు. క్రిమిన‌ల్స్‌కి వ్యతిరేకంగా స‌మాజ్‌వాదీ పార్టీ కనీసం ఒక్క‌ మాట కూడా మా...

Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

Crime
రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌ రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు సూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్‌ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్ర...

పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు

Crime
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి. ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. . లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది. " గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్...
Exit mobile version