Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Ram Temple

అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి
తాజా వార్తలు

అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి

Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం క‌న్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు. మహంత్ సత్యేంద్ర దాస్‌(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర‌ Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Templ...
National

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..

స్వామివారి దర్శన సమయాలను పొడింగించిన ఆలయ ట్రస్టు Ayodhya Ram Mandir | అయోధ్యలో నూతనంగా ప్రారంభించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తుల కు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) సమర్పించుకున్నారు. సాధారణ భక్తులకు అనుమతించిన తొలి రోజే రామ మందిరానికి రూ.3 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లతోపాటు, ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా వెల్లడించారు. మరోవైపు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్...
Trending News

Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..

ధన్ బాద్‌: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ పై రాసి రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతీ రోజు కేవలం గంట ...
National

Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి అయితే తాజాగా ఆలయం నైట్‌ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్‌ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అ...
National

Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి భక్తులకు శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ ఇప్పటికే వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయోధ్య లో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధ...
Exit mobile version