Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
Railways News | సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు రైల్వే బోర్డు వివిధ జోన్లలో 25,000 ఖాళీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఈ స్కీమ్ కింద, రిటైర్డ్ సిబ్బంది 65 ఏళ్లలోపు ఉన్నంత వరకు, సూపర్‌వైజర్‌ల నుంచి ట్రాక్ మెన్ ల వరకు విధులు నిర్వర్తించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ ఫిట్‌నెస్, పనితీరు రేటింగ్‌లు వంటి ప్రమాణాల ఆధారంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకోవడానికి అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు అధికారం ఉంది.
నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులు పదవీ విరమణకు ముందు వారి ఐదేళ్ల సర్వీస్ రికార్డులో మంచి గ్రేడింగ్ కలిగి ఉండాలి. వారిపై ఎటువంటి విజిలెన్స్ లేదా డిపార్ట...