Tuesday, March 4Thank you for visiting

Tag: Railway

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Telangana, తాజా వార్తలు
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...

Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Trending News
Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది. ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...

Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

National
Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాల‌ని నిర్ణయించింది. ఈమేర‌కు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివ‌రాలు వెల్ల‌డించారు. నాలుగు ప్ర‌త్యేక‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు - సంత్రాగచ్చి - ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 1 సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు న‌డుస్తుంది. ఈ రైలు స‌న‌త్ న‌గ‌ర్ లో బుధవారాల‌లో ఉదయం 6:20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8:55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:57 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 10:03 గంటలకు, అక్కడ నుండి రాత్రి 10:08 గంటలకు బయలుదేరుతుంది. ...

Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది…!

National
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్ర‌యాణికుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో భార‌తీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సంఖ్యను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్య‌స్థానాల‌కు వెళ్లడానికి ఎక్కువ మంది ప్ర‌యాణికులు ఈ వందేభార‌త్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్‌ రైళ్ల వేగం క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ట్లు తెలిసింది. గ‌త మూడేండ్లలో వందే భారత్‌ రైళ్ల స్పీడ్‌ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక‌ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ స‌మాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్ స‌మాచార హ‌క్కుచ ట్టం కింద‌ దరఖాస్తు చేయ‌గా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు. IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరల...

UTS Mobile App : జనరల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ టికెటింగ్‌లో కీలక అప్ డేట్..

Trending News
UTS Mobile App : దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు ఒక పెద్ద వరంలాగా, భారతీయ రైల్వేలు టికెటింగ్ విధానంలో అద్భుత‌మైన మార్పును తీసుకువచ్చింది, ముఖ్యంగా జ‌న‌ర‌ల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 20 కిలోమీటర్ల పరిమితిని రైల్వే అధికారులు తొలగించారు. ఇది ల‌క్ష‌లాది మంది రైళ‌/ ప్రయాణీకులకు ఎంతో ఉపశమనాన్ని క‌లిగిస్తుంది. UTS యాప్ అప్‌డేట్‌తో కొత్తగా టికెటింగ్ జన‌ర‌ల్ క్లాస్ ప్రయాణీకులకు టికెటింగ్‌ను సులభతరం చేసేందుకు UTS మొబైల్ యాప్ పునరుద్ధరించారు. కీలకమైన మార్పులలో యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే దూర పరిమితిని తొలగించడం తోపాటు తద్వారా ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే జ‌న‌ర‌ల్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును క‌ల్పించింది.అయితే, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌...
Exit mobile version