Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..
Railway Track Security | దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుందిన ఆగస్ట్ 17న కాన్పూర్ - భీమ్‌సేన్ జంక్షన్ మధ్య అహ్మదాబాద్-బౌండ్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా రైల్వే ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. కొందరు దుండగులు ఉద్దేశపూర్వకగాట్రాక్‌పై సైకిళ్లు, రాళ్లను పెడుతున్నట్లు గుర్తించారు. దీంతో రౌండ్-ది-క్లాక్ ట్రాక్ భద్రతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రైల్వే బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రాక్ మెయింటెయినర్‌ల ద్వారా అప్రమత్తతను పెంచాలని ఆదేశించింది. ఇప్పుడు రౌండ్-ది క్లాక్ పెట్రోలింగ్ కొనసాగుతూనే ఉంట...