General Coaches : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్ కోచ్‌లు
Indian Railway Expansion | ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు 600 కొత్త జనరల్-క్లాస్ కోచ్‌ల (General Coaches ) ను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లకు జతచేశారు. నవంబర్ చివరి నాటికి, దాదాపు 370 సాధారణ రైళ్లలో వెయ్యికి పైగా జనరల్ క్లాస్ కోచ్‌లు జోడించనున్నారు.
రైల్వే ఫ్లీట్‌కు కొత్త కోచ్‌లను చేర్చడం వల్ల ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కాకుండా, రాబోయే రెండేళ్లలో రైల్వే ఫ్లీట్‌కు భారీ సంఖ్యలో నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను జోడించే పని వేగంగా జరుగుతోంది.
రైల్వే బోర్డు (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జనరల్ క్లాస్ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి భారతీయ రైల్వే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులోని ప్రయాణికులకు...