Monday, March 3Thank you for visiting

Tag: Railway Ministry

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Trending News
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా (Full list of Vande Bharat Express trains ) 20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 20833 - విశాఖపట్నం సికిం...

విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం

Trending News
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ భారీగా క్రేజ్ వస్తోంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..? మనదేశంలో  తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మలేషియా, చిలీ, కెనడా  వంటి దేశాలు మన నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి . బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనది  ఒకటి ఖర్చు.  ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 కోట్లు ఆదా అవుతుంది..  ఆకట్టుకునే స...

Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..

National
Union Budget 2024 | కేంద్ర‌ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్ల‌డించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్ర‌యాణికుల‌కు భద్ర‌త‌, సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్ల‌డిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ గురించి కూడా వివ‌రాల‌ను పంచుకున్నారు. రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే...

General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

National
General Class Coaches | న్యూఢిల్లీ: జ‌న‌ర‌ల్ బోగీల్లో ఒంటికాలిపై గంట‌ల కొద్దీ అవ‌స్థ‌లు ప‌డుతూ ప్ర‌యాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకొని భార‌తీయ రైల్వే రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ (అన్ రిజ‌ర్వ్ డ్‌  ) కోచ్ ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండ‌డంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2,500 జనరల్ క్లాస్ కోచ్‌లను తయారు చేయాల‌ని రైల్వే అధికారులు నిర్ణ‌యించారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్‌ సామర్థ్యం భారీగా పెరు...

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Local
Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach R...
Exit mobile version