రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
మధుమేహానికి చక్కని మందు
ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి వందల సంవత్సరాలుగా పండుతోంది. ఇది ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు.
1950లకు ముందు, రాగి, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు సేంద్రీయంగా పండించేవారు. బియ్యం భారతదేశానికి ప్రధాన ఆహారంగ...