Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..
Qutub Minar | దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కావడంతో భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య ఉత్సాహంలో మునిగిపోయింది. ఈ వేడుకల మధ్య ఢిల్లీలోని కుతుబ్ మినార్ (Qutub Minar ) "చునావ్ కా పర్వ్" (ఎన్నికల) థీమ్ కు సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.
భారతదేశ సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి ప్రతీక అయిన కుతుబ్ మినార్ రాత్రిపూట అద్భుతమైన రంగులతో దర్శనమిస్తుంది. ఇది ప్రజల్లో ఓటింగ్ పై స్ఫూర్తిని నింపడానికి వోటింగ్ గొప్పతనాన్ని చాటే లైటింగ్ విజువల్స్ ను ప్రదర్శిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం Xకి ఒక క్లిప్‌ని పోస్ట్ చేసింది. ఓటు వేయమని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. "కుతుబ్ మినార్ #ChunavKaParv థీమ్ అద్భుతమైన ప్రదర్శనతో జష్న్-ఎ-మత్తన్ స్ఫూర్తిని ప్రసరింపజేస్తుంది" అని ECI రాసింది. అందరం ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను జరుపుకుందాం. అని చెబుతోంది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 26...