Pushpa 2 Stampede Case తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కు రెండు కోట్ల సాయం
Pushpa 2 Stampede Case : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈఘటనలో చిన్నారి శ్రీతేజ్ (Sritej)ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుండడంతో కుటుంబ సభ్యులతోపాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి స్పృహ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి అల్లు అరవింద్ కలిశారు.
'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని కలిసిన అనంతరం చిత్రనిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. 'డాక్టర్లతో మాట్లాడిన తర్వాత బాలుడు కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. .
2 కోట్ల సాయం
అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్‌తోపాటు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి, మేము 2 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్ అందించగా, నిర్మాతలు 5...