Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని
Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భక్త సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్యస్నానంతో ముగియనుంది. మహాకుంభమేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో మూడు అమృత స్నానాలు. జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి అమృత స్నానాలు, జనవరి 13న పౌస్ పూర్ణిమ, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఇతర ముఖ్యమైన స్నాన రోజులు. మహాకుభమేళా ఉత్సవాన్ని విజయవంతం పూర్తి చేయడంలో యూపి ప్రభుత్వం సఫలీకృతమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా 45 రోజుల ఉత్సవాలను ముగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ క్షేమం కోరుతూగంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ గొప్ప కార్యక్రమం నేడు ముగిసింది.
Maha K...