Power Outage | ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవస్థలు పడుతున్న సిబ్బంది, రోగులు
నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం
Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు రోగులకు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుపడ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు.
వేసవి ఉక్కపోతను భరించలేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు నిప్పులు చెరిగా...