ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు
రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్
చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని అక్కడే శేష జీవితం గడుపుతానని తెలి...