Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం
Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూకలు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉపయోగిస్తున్నారు.
గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విషయం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి.
అయితే పోలీసులపై అల్లరి మూకలు విసిరిన రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగి...