PM Surya Ghar Yojana : 6.75 శాతం వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందండి.
PM Surya Ghar Muft Bijli Yojana : ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ కార్యక్రమం అయిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందించింది. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలరైజేషన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. "ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఇప్పటివరకు 1 మిలియన్ ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అవుతోందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
PM Surya Ghar Yojana : పథకం అంటే ఏమిటి ?
Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైన సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ (Solar Panels) ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శా...