Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణపాలనలో సుస్థిర నిర్ణయాలు తీసుకున్న నేత
Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్యక్తిత్వం గల నాయకుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన నేతగా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన చెరగని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్కరణలతో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య ఆలోచనలతో దేశానికి సేవ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ (Gwalior)లో 1924 డిసెంబరు 25న అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టారు. అంటే.. ఆయన జన్మించి నేటికి వందేళ్లు అన్నమాట. ఈ రోజు ఆయన శతజయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
అందరూ మెచ్చుకొనేలా…
Atal Bihari Vajpayee Birth Anniversary : 1924 డిసెంబరు 25న జన్మి...