Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు
Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPIని ఉపయోగించే వారికోసం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. UPIకి లింక్ అయిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే అది తొలగించబడుతుంది. UPI చెల్లింపులు చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలలో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని అధికారులు వారు పేర్కొంటున్నారు. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే, అది మోసానికి అవకాశం పెంచుతుంది. ప్రభుత...