Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన బిజెపి
Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంట్ (Parliament)కు రావడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోషల్‌మీడియాలో అనేక మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...