భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates
Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. 'Operation Sindoor' కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున...