Wednesday, March 5Thank you for visiting

Tag: Pagers Explosion

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

World
Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది.   Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack...
Exit mobile version