Swamitva Yojana : ప్రజలకు మోదీ సర్కారు శుభవార్త.. నేడు ప్రాపర్టీ కార్డుల పంపిణీ
దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులకు ప్రాపర్టీ ఆస్తి కార్డులు జారీ చేయనున్నారు. ప్రధానమంత్రి యాజమాన్య పథకం (prime Minister Ownership plan) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
'స్వామిత్వ పథకం' ఎప్పుడు ప్రారంభించారు?
ఈ పథకాన్ని ఏప్రిల్ 24, 2020 (జాతీయ పంచాయతీ ...