Wednesday, April 23Welcome to Vandebhaarath

Tag: Online Ticket Booking

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్
Telangana

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు.  తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11:49కు జగిత్యాల చేరుకుంటుందని  వెల్లడించారు. కాగా రైలు సర్వీస్ పున: ప్రారంభించిన రైల్వే అధికారులు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే టికెట్స్‌ బుకింగ్‌  గడువు తగ్గింపు! మరోవైపు రైలు టిక్కెట్ ముందస్తు బుకింగ్ గడువును కూడా భారతీయ రైల్వే తగ్గించి ప్రయాణికులకు భారీ ఊరట కలిగించింది. . రైల్వే శాఖ గతంలో ఉన్న 120 రోజుల గడువును 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్...
Trending News

Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు ...
Trending News

How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువుల‌తో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవ‌డం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది క‌న్ఫార్మ్‌ రైలు టిక్కెట్‌ను దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటిక‌ప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. ఇక హైదరాబాద్ నుంచి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే రైళ్ల పరిస్థితి అత్యంత‌ దారుణంగా ఉంటుంది. తత్కాల్‌లో సీటు వస్తుందో రాదో న‌మ్మ‌కంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కరెంట్ టికెట్ ఆప్ష‌న్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు కరెంట్ టిక్కెట్‌ను బుక్ చేసుకుని ప్రయాణించవచ్...
National

Railway Super App | రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం త్వరలో సూపర్‌ యాప్‌..!

Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త,  ఆన్ లైన్ లో  రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని  ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల  ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల కోసం  కొత్తగా సూపర్‌ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు.  రైల్వేలకు సంబంధించిన అన్నిసేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్‌ చేసేందుకు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వేశాఖకు సంబంధించి...
Exit mobile version