ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ OTS ఆఫర్
హైదరాబాద్ : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం 'వన్ టైమ్ స్కీమ్' (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. OTS కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.
2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి న...