Monday, April 21Welcome to Vandebhaarath

Tag: One Nation One Election

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం
National

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు. నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Special Stories

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది . 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు? పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...
తాజా వార్తలు

One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం వంద రోజుల పాల‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్ర‌స్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌ని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది....
Exit mobile version