Metro Phase-2 Update | ఓల్డ్ సిటీలో ఊపందుకున్న ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మెట్రో పనులు
Hyderabad Metro Phase-2 Update | హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (MGBS - Chandrayangutta) మార్గంలో ఏడున్నర కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. మెట్రో నెట్‌వర్క్ సకాలంలో విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి.
ఆస్తుల సేకరణలో పురోగతి
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి 1,100 గుర్తించిన ప్రభావిత ఆస్తుల సేకరణ శరవేగంగా సాగుతున్నట్లు ధృవీకరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సహకరిస్తూ భూసేకరణ ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి గాను ఎన్విఎస్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం ఆస్తుల్లో 900కు సంబంధించి భూసేకరణ చట్టం కింద ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. దశలవారీగా 800 ప్రాపర్టీలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లు జారీ చేశా...