ola electric s1 కొత్త వేరియంట్
ధర రూ. 99,999
ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణయిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.
11 రంగుల్లో అందుబాటులో..
ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ నియో మింట్. S1 ప్రో, S1 వేరియంట్లతో పోలిస్తే S1 పోర్ట్‌ఫోలియోలో 115...