India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?
India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..
ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది.
ఇందులో అ...