Yogi Model | యూపీలో ఆగని నేరస్థుల వేట ఏడేళ్లలో 7వేల మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్టు..
Yogi Model | ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) క్రిమినల్స్ ఆటకట్టించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. గురువారం బహ్రైచ్ హింసాకాండలో పాల్గొన్న ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ హడా బసేహరి ప్రాంతంలో జరిగింది, ఇది నాన్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది భారత్ , నేపాల్ సరిహద్దు నుండి 15 కి.మీ దూరంలో ఉంది.
యూపీ పోలీసు బలగాలకు ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు ఇదే మొదటిసారి కాదు . అధికారం చేపట్టినప్పటి నుంచి, యోగీ ప్రభుత్వం మాఫియాలు, గ్యాంగ్‌స్టర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. నేరాలను అరికట్టడానికి కఠినమైన చర్యలను అమలు చేసింది. నేరస్థులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్‌లను బుల్‌డోజింగ్ చేయడం ద్వారా, యోగి మోడల్ దేశంలోనే పాపులర్ అయింది. పౌరుల భద్రతపై విశ్వాసాన్ని ...