Bihar Politics LIVE Updates : Bihar | సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం
Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య జేడీయూ వద్ద ఉన్నదా? అనే అంశాలను పరిశీలిద్దాం.
243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.. ఆర్జేడీ పార్టీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. మరో వైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవలం 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ...