Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: NHAI

NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Career

NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిఉన్న‌త‌మైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌వారికి గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ 6 డిసెంబర్ 2024 నుంచే ప్రారంభమైంది . అర్హత గల అభ్యర్థులు జనవరి 6, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, NHAI రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర‌ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. ఇది గ్రూప్-ఎ స్థాయి స్థానాన్ని పొందేందుకు అవకాశాన్ని క‌ల్పిస్తుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుంచి ఖాళీల సంఖ్య గురించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. మొత్తం 17 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అభ్యర్థులు స్థ...
Trending News

Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ

Nitin Gadkari - Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట  బేబీ కేర్‌ రూమ్స్‌, క్లీన్‌ టాయిలెట్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్రాంతాలు,  ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన  ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతు...
National

2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..

Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు. భారతదేశంలో ప్రతిరోజూ 33 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేయడానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నిర్మించనున్న 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మొత్తం పొడవు 5,467 కి.మీ. ఈ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు 16 రాష్ట్రాల ...
Andhrapradesh

Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు. సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణ...
Telangana

Elevated Corridor Project | హైద‌రాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక‌..

Elevated Corridor Project | హైద‌రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న‌ మార్గాల్లో చేప‌ట్ట‌నున్న‌ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. ఈ కారిడార్లకు సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలు, అలాగే వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఓ కన్సల్టెన్సీని హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయ‌నుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నియమాకం చేసే కన్సల్టెన్సీ నివేదిక కీలకమ‌వుతుంది. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ హైదరాబాద్‌ - కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ ను...
Andhrapradesh, Telangana

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...
Telangana

Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

Telangana Road ways |  మోదీ 3.0 ప్రభుత్వంలో  మొదటి 100 రోజుల ప్రణాళికలో తెలంగాణకు రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రహదారులకు అవకాశం కల్పించారు. అందులో ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల హైవే నిర్మించాలని  నిర్ణయించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు మహర్దశ వచ్చినట్లైంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజామాబాద్ - ఛత్తీస్ గడ్ హైవే.. నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న నేషనల్ హైవే 63ను విస్తరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా పెద్ద పట్టణాలు, గ్రామాలు ఉ...
Exit mobile version