New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.
New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమలుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై OTP వస్తుంది. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి వారికి ఇకపై స్థానిక నంబర్ అవసరం లేదని, కొనుగోలు కోసం వారి ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు.
New SIM card rules for Indian citizens : దీంతోపాటు భారత పౌరుల కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి పౌరులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధ్రువీకరణ ఇప్పుడు తప్పనిసరి. eKYC లేకుండా వ్యక్తులు కొత్త మొబైల్ నంబర్ తీసు...